- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈటల రాజీనామాతో ప్రజలకు మంచే జరిగింది : తుమ్మేటి
దిశ, జమ్మికుంట : మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఒరిగేది, జరిగేది ఏదీ లేదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని రాజకీయ ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఈటల రాజేందర్ రాజీనామాతో స్వేచ్ఛ వచ్చిందన్నారు. ఈటలను మంత్రి పదవి నుండి తొలిగించిన తర్వాత నిద్రపట్టక నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజల విశ్వసనీయత కోల్పోయారని, హుజురాబాద్ ప్రాంత ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆరే మీ నిజస్వరూపాన్ని ముందే పసిగట్టి బయటకు పంపడం వల్ల నియోజక వర్గ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని వివరించారు. ‘‘ఈటల రాజీనామాతో హుజురాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో నిధులు సమకూరుస్తున్నారని’’ వెల్లడించారు.
నియోజకవర్గ ప్రజలకు మీరే సర్వస్వం అనే విధంగా వ్యవహరించి, రాజకీయ నాయకులను అందరినీ తొక్కి పడేసావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మీ వెంట ఎవరు ఉండరని, బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని నమ్మడం లేదు తుమ్మేటి జోస్యం చెప్పారు.