జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

by Anukaran |   ( Updated:2020-09-26 00:15:56.0  )
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు, అనేక మంత్రి ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీకి కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైంది. జార్ఖండ్ బీజేపీ శాసనసభా పక్ష నేత అయిన మరాండీకి కరోనా లక్షణాలు కనిపించడంతో అతనికి కరోనా పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

‘నాకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఇటీవల తనను కలిసిన వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను.’ అని బాబులాల్ మరాండీ ట్విట్టర్ వేదికగా విషయం తెలిపారు. ‘మీ అందరి ఆశీర్వాదాలతో త్వరలోనే నేను కరోనాను జయించి ప్రజాసేవలో నిమగ్నమవుతాను’ అని బాబులాల్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed