కరోనాతో ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కన్నుమూత

by Shamantha N |
కరోనాతో ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కన్నుమూత
X

న్యూఢిల్లీ: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, పద్మ శ్రీ, డాక్టర్ కేకే అగర్వాల్ కరోనాతో కన్నుమూశారు. కరోనాతో సుదీర్ఘ పోరాటం తర్వాత ఎయిమ్స్‌లో సోమవారం రాత్రి ఆయన మరణించినట్టు కుటుంబీకులు తెలియజేశారు. కొన్నాళ్లుగా ఆయన వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారు. డాక్టర్‌గా ప్రజల సంక్షేమానికి, ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి కేకే అగర్వాల్ అవిరామ కృషి చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా కాలంలోనూ వీడియోలు, ప్రకటనలతో లక్షలాది మందిలో అవగాహన కల్పించారని వివరించారు. డాక్టర్ అగర్వాల్ మృతికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశానికే ఎదురుదెబ్బ అని, పేదల ఆరోగ్య హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఉన్నతుడని పేర్కొన్నారు.

Advertisement

Next Story