జార్ఖండ్ మాజీ గవర్నర్ కన్నుమూత

by Shamantha N |   ( Updated:2020-06-06 00:29:56.0  )
జార్ఖండ్ మాజీ గవర్నర్ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: జార్ఖండ్ రాష్ట్ర మాజీ గవర్నర్ వేద్ మార్వాహ్ (87) కన్నుమూశారు. శుక్రవారం గోవాలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మార్వాహ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గోవా డీజీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 1985-88 వరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా, 1988-90 వరకు ఎలైట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క మూడవ డైరెక్టర్ జనరల్ గా మార్వాహ్ సేవలందించారు.

Advertisement

Next Story