‘నువ్వు చిక్కుల్లో పడొద్దు సేతుపతి’

by Shyam |
‘నువ్వు చిక్కుల్లో పడొద్దు సేతుపతి’
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ నటుడు విజయ్ సేతుపతికి మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్ లేఖ రాశారు. తన బయోపిక్ చిత్రం 800లో విజయ్ సేతుపతి నటించొదద్దన్న మురళీధరన్.. ఈ చిత్రంతో చిక్కుల్లో పడవద్దని సూచించారు. సేతుపతి భవిష్యత్తు ఏకంగా ప్రశ్నార్థకంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని శ్రీలంక మాజీ స్పిన్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. అవమానాలు తనకు మామూలే అన్నముత్తయ్య.. ఈ సినిమా నుంచి వైదొలగాలని చెప్పారు.

అయితే, శ్రీలంక లెజెండరీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ పై తమిళ్‌లో బయోపిక్ సినిమా తీస్తున్నారు. ఇదే సినిమాలో విజయ్ సేతుపతి నటించడానికి సిద్ధమయ్యాడు. దీనికి 800 అని టైటిల్ కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పై తొలి నుంచే విమర్శలు వస్తున్నాయి. షేమ్ ఆన్ విజయ్ సేతుపతి అంటూ ట్రోల్స్ పెరిగాయి. శ్రీలంకలో తమిళ ప్రజలను అణచివేస్తుంటే.. లంక ఆటగాడి బయోపిక్ ఎలా తీస్తారని తమిళవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని పై స్పందించిన ముత్తయ్య మురళీధరన్ విజయ్ సేతుపతికి లేఖ రాశాడు. తన కారణంగా చిక్కుల్లో పడొద్దని హితవు పలికారు.

Advertisement

Next Story