సీపీఐ మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూత

by srinivas |
Former CPI MLA Kakarlapudi Subbaraju
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ సీనియర్ నాయకుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు(66) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం అర్ధరాత్రి గుండె పోటుతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికాలో ఉంటున్న ఆయన కుమారుడు, కూతురు విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన విజయవాడకు బయలుదేరారు. కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరుపుతారని వారి బంధువులు తెలిపారు. 1994-99 మధ్య కాలంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సుబ్బరాజు సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‎గా ఉన్నప్పుడు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సుబ్బరాజు పని చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా, సీపీఐ, అనుబంధ సంఘాల్లో సుబ్బరాజు సేవాలందించారు. ఆయన మృతి పట్ల సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంతాపం తెలిపారు. సుబ్బరాజు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed