కనికా కపూర్ పార్టీలో వసుంధర రాజే, దుశ్యంత్

by Shamantha N |
కనికా కపూర్ పార్టీలో వసుంధర రాజే, దుశ్యంత్
X

జైపూర్ : రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె తనయుడు, ఎంపీ దుశ్యంత్ సింగ్‌లు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలిపారు. యూపీలోని లక్నోలో ఇటీవలే నిర్వహించిన ఓ పార్టీలో వీరిరువురు అటెండ్ అయ్యారు. ఆ పార్టీకి హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీ సింగర్ కనికా కపూర్‌కు శుక్రవారం కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందుజాగ్రత్తగా వసుంధర రాజే, దుశ్యంత్‌లు స్వచ్ఛందంగా ఏకాంతవాసంలోకి వెళ్లినట్టు తెలిపారు.

Tags : former cm, vasundhara raje, son, mp dushyanth singh, self quarantine, kanika kapoor

Advertisement

Next Story