సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా కన్నుమూత

by Shamantha N |   ( Updated:2021-04-15 22:48:19.0  )
సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా కన్నుమూత
X

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా కన్నుమూశారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. 1974 వ బ్యాచ్‌కు చెందిన రంజిత్ సిన్హా.. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) తో పాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కి డైరెక్టర్ జనరల్ (డీజీ) గా, సీబీఐ డైరెక్టర్ గానే కాక అనేక ఉన్నత పదవుల్లో పనిచేశారు. ఈయన శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తు్న్నది.

Advertisement

Next Story