విషాదంలో కాంగ్రెస్.. మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

by Shamantha N |
former assam cm bhumidar burman
X

గువహతి: అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూమిదర్ బర్మన్ (91) ఆదివారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గువహతిలోని ప్రైవేట్ ఆస్సత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 1931 అక్టోబర్ 12న అసోంలోని బెల్సోర్‌ (అప్పటి బ్రిటిష్ ప్రెసిడెన్సీ)లో జన్మించిన బర్మన్.. 1951లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా (అసోం, బొర్ఖెట్రి నియోజకవర్గాల నుంచి) ఎన్నికైన బర్మన్.. 1996లో అసోం ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2010 లో అప్పటి సీఎం తరుణ్ గగోయ్‌కు గుండె శస్త్ర చికిత్స కావడంతో కొన్ని రోజుల పాటు సీఎంగా ఉన్నారు. బర్మన్ కుమారుడు దిగంత బర్మన్ ప్రస్తుతం బొర్ఖెట్రి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అసోం ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్న విషయం విదితమే.

Advertisement

Next Story

Most Viewed