ఆయనకు 8 మంది బినామీలు

by Anukaran |
ఆయనకు 8 మంది బినామీలు
X

దిశ, వెబ్‌డెస్క్: అక్రమాస్తుల కేసులో మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి మొదటి రోజు కస్టడీ పూర్తి అయింది. విచారణలో భాగంగా అక్రమాస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు బయటకి తీశారు. మొత్తం 8 మంది నర్సింహారెడ్డికి బినామీలు ఉన్నట్టు తేలింది. బినామీలను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. సజ్జన్‌గౌడ్, తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అర్జున్ జైపాల్, శ్రీరామ్, బండి రాంద్రారెడ్డి, రమేశ్, శ్రీనివాస్ రెడ్డి అనే బినామీలు అరెస్ట్ అయ్యారు.

లంచాలు తీసుకొని వచ్చిన ఆదాయాన్ని మొత్తం బినామీల పేరు మీదుగా నర్సింహారెడ్డి మార్చాడు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల పేరుమీదుగా గిఫ్ట్ డిడ్‌లను చేయించుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ బినామీల్లో శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర వహించినట్టు నిర్ధారణ అయింది. నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ నిర్వహాకుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాజీ ఏసీపీ పెద్ద ఎత్తున రియల్ వ్యాపారం చేసినట్టు తెలుస్తోంది. మాదాపూర్ లోని ల్యాండ్ కూడా శ్రీనివాస్ రెడ్డి పేరు మీదనే ఉన్నట్టు నిర్ధారణ అయింది. అంతేకాకుండా ఇతర పోలీసు అధికారులకు కూడా శ్రీనివాస్ రెడ్డి బినామీగా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది.

Advertisement

Next Story

Most Viewed