డ్వాక్రా రుణాలను మాఫీ చేయండి..

by Shyam |
Mothe-Srilatha
X

దిశ, సిటీ బ్యూరో : డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని తార్నాక డివిజన్‌లోని వినాయక నగర్ డ్వాక్రా గ్రూప్ ప్రతినిధులు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. గురువారం TTUC రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రెడ్డి.. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతకు క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిప్రతాన్ని సమర్పించారు. ఈ క్రమంలో కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నామని, వ్యాపారాలు కూడా సరిగా నడవడం లేదు అని, ఇంటి అద్దె, కరెంట్ బిల్లు కట్టడానికే ఇబ్బంది పడుతున్నామని విన్నవించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో డ్వాక్రా గ్రూప్ రుణాలు మాఫీ చేయించే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed