- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మృగం అడుగు జాడలు..కొనసాగుతున్న అన్వేషణ
దిశ, కోరుట్ల : జగిత్యాల పట్టణ వాసులను కలవరపెడుతున్న ఓ జంతువు కోసం అన్వేషణ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి పట్టణ వాసులను ఆందోళనకు గురి చేసిన ఆ మృగం చిరుత పులా లేక అడవి పిల్లా అన్నది ఇంకా తేలలేదు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో దాని కాలి ముద్రలు గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. వలలు వేసి పట్టుకోవాలని ప్లాన్ చేసిన అధికారులకు ఇంతవరకు దాని జాడ చిక్కలేదు. కాలి ముద్రలను మాత్రం సేకరించి అవి ఏ జంతువుకు సంబంధించినవో తెలుసుకునేందుకు నిపుణల బృందానికి పంపించారు. అదేరోజు రాత్రి జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తిపై వింత జంతువు దాడి చేసినట్టు తెలియడంతో మళ్లీ పట్టణ వాసులు భయాందోళనకు గురయ్యారు.ఈ నేపథ్యంలోనే అటవీ అధికారులు వరంగల్ నుంచి ప్రత్యేకంగా రెస్క్యూ టీంను రప్పించారు. పట్టణంలో ఆ జంతువు అడుగుజాడలు కనిపించిన ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి గాలింపు చేపట్టినా దాని ఆనవాళ్లు మాత్రం దొరకలేదు. అయితే శుక్రవారం రాత్రి దాడి చేశాక అది అక్కడి నుంచి వెళ్లిపోయిందా లేక..అదే ప్రాంతంలో దాక్కుని ఉందా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరుత పులిని పోలినట్టుగానే ఉండే అడవి పిల్లి అయి ఉంటుందన్న అభిప్రాయాలే పట్టణంలో ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి.ఆ జంతువు వలలకు చిక్కితే తప్ప పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదని అటవీ అధికారులు స్పష్టంచేశారు.