అటవీ అధికారులపై దాడి

by Sumithra |
అటవీ అధికారులపై దాడి
X

దిశ‌, ఖ‌మ్మం: విధుల్లో ఉన్న అట‌వీ అధికారుల‌పై పోడు రైతు కుటుంబం దాడికి పాల్పడ్డ ఘ‌ట‌న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరిపేట స‌మీపంలో సోమ‌వారం జ‌రిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బీట్ పరిధిలో కొంతమంది రైతులు పోడు భూములు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ భూముల్లో బీట్ ఆఫీసర్ కందకాలు తీయించారు. దీంతో ఓ కుటుంబం ఫారెస్ట్ అధికారులపై భౌతిక దాడికి దిగింది. మహిళా అధికారి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దాడిచేసినట్టు అధికారులు వాపోయారు. కాగా, దాడులకు పాల్పడిన నలుగురు నిందితులపై కేసు న‌మోదు చేసినట్టు వెల్లడించారు.

tags: forest officer attacked, podu farmers, burgampadu, khammam, podu cultivation

Advertisement

Next Story