- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అధికారులకు డెడ్‌లైన్ పెట్టిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
by Aamani |
X
దిశ, ముధోల్: గుండెగావ్ పునరావాసానికి అయ్యే ఖర్చు, ఇతర వివరాలను రేపు సాయంత్రంలోగా ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపించాలని జిల్లా అధికారులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఉదయం నిర్మల్‌లో వరద నష్టం అంచనాపై వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడారు. గుండెగావ్ పునరావాసానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో ప్రస్తావించారు. దీంతో మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటిలోగా పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపించాలని ఆదేశించారు. అలాగే ముధోల్ నియోజకవర్గంలో వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కూడా న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరాగా.. పంట నష్టం పై కూడా అంచనా వేస్తామని కలెక్టర్ ముషారఫ్ అలీ తెలిపారు.
Advertisement
Next Story