విదేశీ సిగరెట్లు స్వాధీనం

by Shyam |   ( Updated:2020-06-13 11:34:38.0  )
విదేశీ సిగరెట్లు స్వాధీనం
X

దిశ, క్రైమ్ బ్యూరో: ఢిల్లీ నుంచి విదేశీ సిగరెట్లను అక్రమంగా దిగుమతి చేస్తూ.. నగరంలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ అహ్మద్ రెండేళ్లుగా ఢిల్లీ సదర్ బజార్ నుంచి చైనా, మలేషియా, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా దేశాలకు చెందిన సిగరెట్లను రైల్వే, రోడ్డు మార్గాల ద్వారా తరలిస్తున్నాడు. హైదరాబాద్‌లోని పలు పాన్ దుకాణాలు, ఇతర వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. చట్ట విరుద్దంగా ఎలాంటి బిల్లులు లేకుండా వ్యవహారం నడుపుతున్నాడు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఈ సిగరెట్లు ఇండియన్ బ్రాండ్ల కంటే వినియోగదారులు అత్యధికంగా కొనడానికి ఇష్టపడటంతో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా అధక ధరలకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న నార్త్ జోన్ పోలీసులు చాంద్రాయణగుట్టలోని అల్ జుబైల్ కాలనీలో మహ్మద్ అహ్మద్ ఇంటిపై దాడి చేయగా, సుమారు రూ.12 లక్షల 60 వేల విలువైన 18 కార్టన్ బాక్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితున్ని చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈదాడిలో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్ స్పెక్టర్ కె.నాగేశ్వర రావు, ఎస్ఐలు జి.రాజశేఖర్ రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed