- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ శాంపిళ్ల కోసం హెలికాప్టర్లు వాడండి
X
డెహ్రాడూన్: కొవిడ్ శాంపిళ్లను తరలించడానికి అవసరమైతే హెలికాప్టర్లను వాడాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. భూపాతాల వల్ల రోడ్లు ధ్వంసమై కరోనా శాంపిళ్లను టెస్టుల కోసం ల్యాబరేటరీలకు తరలించడం కష్టమైతే, ఈ కారణంగా మారుమూల ప్రాంతాల నుంచి శాంపిళ్లను సేకరించడానికి మూడు, నాలుగు రోజుల కంటే ఎక్కువ జాప్యం పడితే హెలికాప్టర్ల సేవలు వినియోగించుకోవాలని సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శాఖ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో భేటీలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్ నేగి తెలిపారు. రోడ్ల ద్వారా వాహనాలు వెళ్లలేని పరిస్థితులుంటే సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్ సమాచారమివ్వాలని, ఆ ఏరియాలోని కొవిడ్ శాంపిళ్లను ల్యాబ్‌కు తరలించడానికి డెహ్రాడూన్ నుంచి హెలికాప్టర్లు వెళతాయని వివరించారు.
Advertisement
Next Story