మానవత్వమా ఎక్కడా నీ చిరునామా..?

by Sridhar Babu |   ( Updated:2021-12-09 22:40:34.0  )
food-poison1
X

దిశ, సదాశివపేట: సదాశివపేట పట్టణ పరిధిలోని పాత కచేరి నాగుల కట్ట వెనకాల ఉన్న ఒక ఆవు(గర్భిణీ)కు ఫుడ్ పాయిజన్ కాగా గురకలు తీస్తూ పడిపోయింది. ఇది గమనించిన పలువురు సంబంధిత డాక్టర్ కు సమాచారమందించారు. దీంతో అతను అక్కడికి చేరుకుని ఇంజక్షన్ ఇచ్చి ఫుడ్ పాయిజన్ అయిందని వివరించి వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న ఇంకొంతమంది జనాలు మాత్రం చూస్తుండి పోయారు గానీ, ఎలాంటి సహాయం చేయలేదు. గురకలు తీస్తూ ఆవు బాధపడుతున్నా మనకెందుకులే అని పట్టించుకోలేదు. వార్డు కౌన్సిలర్ గానీ, హిందూ వాహిని అని చెప్పుకుని తిరిగేవాళ్లు గానీ రాలేదు. అక్కడే ఉన్న దిశ రిపోర్టర్ వీడియోలు, ఫొటో తీయడానికి వెళ్లగా ఫోన్ ద్వారా అక్కడే ఉన్న ఒకరిద్దరు ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం.

Advertisement

Next Story