ఉధృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగు..!

by Shyam |
ఉధృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగు..!
X

దిశ, దుబ్బాక: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు సమీపంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

కమిషనర్ జోయల్ డేవిస్ ఆదేశాల ప్రకారం.. కూడవెల్లి వాగుకు ఇరువైపులా ఉన్న గ్రామాల రహదారులు మూసివేశారు అధికారులు. రోడ్డుకు ఇరువైపులా స్టాపర్లు, కట్టెలు వేసి ఎవరు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వరద ఉధృతి తగ్గేవరకు గ్రామస్తులు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని అవగాహన కల్పించారు. సంబంధిత గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులకు గ్రామాలలో చాటింపు చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే ఆరేళ్ల క్రితం నిర్మించిన లింగుపల్లి వద్ద బ్రిడ్జి ఇంతవరకు ప్రారంభించక పోవడం గమనార్హం. గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నోసార్లు ఇదే రోడ్డుపై వెళ్లారని, కానీ ఇంతవరకు బ్రిడ్జిని పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story