- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉరకలేస్తున్న కృష్ణమ్మ
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణమ్మ ఉరకలేస్తోంది. ఎగువ నుంచి వరదలు కొనసాగుతున్నాయి. ఆల్మట్టికి 1,51,598 క్యూసెక్కులు వస్తుండటంతో దిగువకు 1,75,672 క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయానికి 1.79లక్షల ఇన్ ఫ్లో ఉండటంతో దిగువనకు 1.86 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. జూరాల దగ్గర శనివారం రాత్రి వరకు 2.10 లక్షల క్యూసెక్కులు నమోదువుతోంది. దీంతో 28గేట్ల ద్వారా 1.97లక్షల క్యూసెక్కులు, పవర్ హౌజ్ ద్వారా 21వేల క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు.
అల్మట్టికి మరింత వరద పెరుగుతుందని కేంద్ర జలసంఘం అప్రమత్తం చేసింది. నారాయణపూర్ రిజర్వాయరుకు 2.25 లక్షల క్యూసెక్కులు వస్తుందని, దిగువనకు నీటి విడుదల పెంచాలని సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.94 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు తుంగభద్రకు వరద ప్రవాహం పెరిగింది. శనివారం సాయంత్రం వరకు 1.10 లక్షల క్యూసెక్కులు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు 55టీఎంసీల నిల్వకు చేరింది. ఒక్కరోజే 10టీఎంసీల నీరు చేరింది. ఈ ప్రవాహం కొనసాగితే తుంగభద్ర నుంచి నీటిని వదులనున్నారు. గోదావరి బేసిన్‌లో ఎల్లంపల్లికి 20 వేల క్యూసెక్కులు వస్తున్నాయి. ఎస్సారెస్పీకి 1192 క్యూసెక్కులు వస్తుండగా… మిడ్ మానేరుకు 12వేల క్యూసెక్కులు చేరుతున్నాయి. పెరూర్ దగ్గర 70 క్యూసెక్కుల వరద నమోదవుతోంది.