Flipkart: ‘బిగ్‌ సేవింగ్‌ డేస్‌’లో క్రేజీ ఆఫర్స్

by Harish |   ( Updated:2021-07-21 02:56:31.0  )
Flipkart, Big Saving Days
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్‌ వస్తు విక్రయ వేదిక ‘ఫ్లిఫ్‌కార్ట్‌’ జులై 25 నుంచి 29వ తేదీ వరకు ‘బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌’ సేల్స్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులు ఒకరోజు ముందుగానే అంటే జులై 24 నుంచే ఈ డీల్స్‌ను పొందే అవకాశం కల్పించింది. Realme, POCO, VIVO, Motorola వంటి బ్రాండ్ల నుంచి వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తాయి. 80 శాతం వరకు, టీవీలు, ఇతర ఉపకరణాలకు 75 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. జూలై 25 నుండి ప్రారంభం కానున్న ఈ ‘బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌’ సేల్స్‌ 2021 జులై 29తో ముగియనుంది.

ఇక, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారు 10శాతం తక్షణ రాయితీని పొందే అవకాశం ఉంది. బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌లో భాగంగా రియల్‌మి సీ20 రూ.500 తగ్గి రూ.6,499కే లభించనుంది. ఇక రూ.18,999 విలువైన పోకో ఎక్స్‌3 ప్రో రూ.17,249… రూ.19,999 ధర ఉన్న రియల్‌ మి ఎక్స్‌7 5జీ ఫోన్‌ రూ.18,999… మోటో జీ40 రూ.13,499(అసలు ధర రూ.14,999)లకే లభించనుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌62 ధరను కూడా తగ్గించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. అయితే, ఎంత డిస్కౌంట్‌ వస్తుందనే మాత్రం పూర్తి వివరాలు పొందుపర్చలేదు. ఐఫోన్‌లలో కూడా క్రేజీ ఆఫర్లను ప్రకటించారు. వీటితో పాటు పలు టెలివిజన్‌లు 65శాతం వరకు తగ్గింపుతో లభించనున్నాయి.

Advertisement

Next Story