- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ ఆఫర్.. ఉప్పల్ భగాయత్ వెంచర్‌లో ఫ్లాట్స్.. బిడ్డింగ్‌కు ఆ తేదీనే లాస్ట్
దిశ, హైదరాబాద్ : ఉప్పల్ భగాయత్లే అవుట్‌లో 44 ఫ్లాట్లను ఈ-ఆక్షన్ ద్వారా అమ్మకాలు జరిపే ప్రక్రియలో భాగంగా సోమవారం(15వ తేదీ) ఉప్పల్ వెంచర్‌లో ఫ్రీ బిడ్ సమావేశం జరిగింది. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్అథారిటీ(హెచ్ఎండీఏ) అధికారులు నిర్వహించిన ఈ ఫ్రీ బిడ్ సమావేశం విజయవంతంగా జరిగింది. స్థానిక భూ వ్యాపారులతో పాటు బిల్డర్లు, డెవలపర్లు, కంపెనీలు, ఏజెన్సీల ప్రతినిధులు ఫ్రీ బిడ్సమావేశానికి హాజరై నియమ నిబంధనలు, వారి సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.
హెచ్ఎండీఏ అధికారులు బి.ఎల్.ఎన్.రెడ్డి(చీఫ్‌ఇంజినీర్), కె. గంగాధర్(ఎస్టేట్ ఆఫీసర్), సి. విజయలక్ష్మి(చీఫ్అకౌంట్స్ఆఫీసర్), ఎం. రాంకిషన్(ఓఎస్డీ), కె. గంగాధర్(చీఫ్ప్లానింగ్ఆఫీసర్), ప్రసూనాంబ(ల్యాండ్అక్విజేషన్ఆఫీసర్) ఎంఎస్‌టీసీ అధికారులు ఫ్రీ బిడ్ మీటింగ్‌లో సవివరంగా కొనుగోలుదారుల సందేహాలను నివృత్తి చేశారు. వాయిదాల చెల్లింపులు, రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై అధికారులు వారికి స్పష్టతనిచ్చారు.
బ్యాంక్చార్జీలను కలుపుకొని ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందని, ఎలాంటి సందేహాలున్నా హెచ్ఎండీఏ సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. భారతదేశ పౌరులందరూ బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని, దేశంలో నివసిస్తున్న ఇతర దేశస్తులకు అనుమతి ఉండదని తెలిపారు. ఇప్పటి వరకు రెండు దఫాలుగా జరిగిన ఉప్పల్భగాయత్ఫ్లాట్ల విక్రయాలకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, ఈ సారి కూడా మంచి స్పందన కనబడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 733 ఎకరాల విస్తీర్ణంలో 250 ఎకరాలతో మౌళిక వసతులు కలిగిన ఉప్పల్ భగాయత్ వెంచర్ రానున్న రోజుల్లో హైదరాబాద్‌కు తలమానికంగా నిలుస్తుందని వివరించారు. విజయవాడ, వరంగల్జాతీయ రహదారులకు సమీపంలో క్లియర్టైటిల్స్తో మధ్యతరగతి ప్రజలకు, సంపన్నులకు వీలుగా 150 గజాల నుంచి 5,000లకు పైగా గజాలు కలిగిన ఫ్లాట్లు కలిగి ఉండటం, ఇన్నర్‌రింగ్‌రోడ్డు, ఔటర్ రింగ్‌రోడ్డులకు మధ్యలో ఉండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. నాగోల్–పీర్జాదిగూడ మధ్య లింక్ రోడ్డు అందుబాటులో ఉండటం, ఆసుపత్రి, షాపింగ్కమ్ఎంటర్టైన్మెంట్, మల్టీపర్పస్ యూజ్ కోసం ఇక్కడి స్థలాలు అందుబాటులో ఉండటం కూడా ఉప్పల్ భగాయత్ప్రత్యేకతలుగా అధికారులు వివరించారు.
డిసెంబర్ 2, 3 తేదీల్లో జరిగే ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొని ఫ్లాట్లను దక్కించుకునేవారు 90 రోజుల్లో పూర్తి స్థాయి పేమెంట్ చేసినట్లయితే ఆ తర్వాత పక్షం రోజుల్లో హెచ్ఎండీఏ వారికి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తుందని అధికారులు చెప్పారు. కొనుగోలుదారులు ఫ్లాట్ మొత్తం విలువలో 25 శాతం చెల్లింపులు జరిపితే మిగతా మొత్తం బ్యాంక్రుణంగా పొందే అవకాశం కూడా ఉందన్నారు. ఉప్పల్ భగాయత్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ భవన నిర్మాణ అనుమతులు మాత్రం హెచ్ఎండీఏ ఇస్తుందని అధికారులు స్పష్టం చేశారు.