పెద్ద నోట్ల రద్దుకు ఐదేండ్లు.. బ్లాక్‌ డే అంటూ నెటిజన్ల ట్రోల్స్

by Anukaran |   ( Updated:2021-11-07 23:16:57.0  )
పెద్ద నోట్ల రద్దుకు ఐదేండ్లు.. బ్లాక్‌ డే అంటూ నెటిజన్ల ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అవినీతిపై పోరాటం, నల్లధనం కట్టడి కోసం ప్రధాని మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుకు నేటికి ఐదేండ్లు గడిచాయి. ఇందులో భాగంగా 1000, 500 పాత నోట్లను రద్దు చేసి, వాటిస్థానంలో కొత్త నోట్లను(2000, 500, 200, 100, 50, 20, 10) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా, 2016, నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ఆర్థిక గణాంకాల ప్రకారం చలామణీలో ఉన్న నోట్ల విలువ రూ. 17.74 కోట్లుగా ఉంది. చలామణీ తగ్గించడం, డిజిటల్ పేమెంట్‌ల ఎంకరేజ్‌మెంట్ కోసమంటూ మోడీ డిమానిటైజేషన్‌ చేశారు.

కానీ, ఐదేండ్లు గడిచినా నల్లధనం వెనక్కి తీసుకురావడంలో కేంద్ర సర్కార్‌ విఫలమైంది అన్న అపవాదు మూటగట్టుకుంది. దీనికితోడు 2016లో రూ. 17.74 లక్షల కోట్లలో ఉన్న నోట్ల చలామణీ.. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఏకంగా రూ. 29.17 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా కారణంగా ప్రజలు సేవింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పెరిగిందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో డిజిటల్ పేమెంట్‌లు కూడా దేశంలో ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి.

బ్లాక్ డే అంటోన్న ప్రతిపక్షాలు..

ఇక ఇదే వ్యవహారంపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, నెజిజన్లు ధ్వజమెత్తారు. మోడీ తీసుకున్న నిర్ణయం దేశానికి బ్లాక్ డే అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేండ్ల ఆర్థిక వ్యవస్థ పతనానికి 2016, నవంబర్ 8 పునాది అంటూ సెటైర్లు వేస్తున్నారు. బ్లాక్‌ మనీ వెనక్కి తీసుకొస్తామన్న బీజేపీ ప్రభుత్వం..పేదలు, మధ్య తరగతి ప్రజల నుంచి జీఎస్టీ పేరుతో వసూళ్లు చేస్తోంది అంటూ ఆరోపించడం గమనార్హం.

Advertisement

Next Story