ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం..!

by Sumithra |
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం..!
X

దిశ, పటాన్‌చెరు: అభం శుభం తెలియని చిన్నారిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం దోమడుగులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దోమడుగులో నివాసముంటున్న శ్రీనివాస్, రాములమ్మల ఐదేళ్ల కూతురిని అందరూ నిద్రిస్తున్న సమయంలో కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు. దుండగులు అత్యాచారానికి పాల్పడి చిన్నారిని వదిలేశారు. అనంతరం చిన్నారి ఏడ్చుకుంటూ ఇంటి ముందుకు రావడంతో తల్లిదండ్రులు ఏమైందని పరీక్షించారు. చిన్నారికి రక్తస్రావం గుర్తించిన తల్లిదండ్రులు.. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుమ్మడిదల ఎస్ఐ రాజేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed