భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి.. అంతలోనే?

by Shamantha N |   ( Updated:2020-10-23 05:48:33.0  )
భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి.. అంతలోనే?
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు మదురై జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీపావళి సమయం దగ్గర పడుతుండడంతో బాణాసంచా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి పెంచారు. ఇదే సమయంలో తిరుమంగళం ఫైర్‌ వర్క్స్‌లో భారీగా పొటాషియం నిల్వ ఉంది. దీంతో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో ఐదురుగు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు వర్కర్లు తీవ్ర గాయాలు అయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మరో అగ్నిప్రమాదం:

మదురైలోని తిరుమంగళం ఫైర్ వర్క్స్‌ మంటలు చల్లారక ముందే.. తమిళనాడులో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కృష్ణగిరి జిల్లాలోని మరో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా బాణాసంచా మోతతో తీవ్రంగా మంటలు వ్యాపించాయి. అక్కడి స్థానికులు, వర్కర్లు ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed