- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు నెలల చిన్నారి.. 20 ఏళ్లకు శిలగా మారుతుందట.!
దిశ, వెబ్‌డెస్క్: ఐదునెలల పాపకు చలనం లేదు.. ఏం చేసినా కదలదు.. 20 ఏండ్లు వచ్చాయంటే ఇక శిల్పమే.. జీవచ్ఛవంలా బెడ్‌కు పరిమితం కావాల్సిందే. 40 ఏండ్లకు ప్రాణాలు వదలాల్సిందే.
ఇటువంటి అరుదైన వ్యాధి సోకింది యూకేకు చెందిన పసిబిడ్డకు. హేమెల్ హెంప్‌స్టెడ్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన అలెక్స్, దవేలు దంపతులు. కొన్నెండ్ల క్రితం వివాహం చేసుకున్న వీరికి తొలుత కుమారుడు జన్మించాడు. ఈ ఏడాది జనవరి 31న మరో పసిబిడ్డ జన్మించింది. కానీ, ఆ ఆనందం వారికి శాశ్వతం కాలేదు. ఐదు నెలలు వచ్చినా పాప కాళ్లు, చేతి బొటనవేలికి చలనం లేదని గుర్తించిన అలెక్స్, దవేలు వెంటనే వైద్యులను సంప్రదించారు. ఈ క్రమంలో పసిబిడ్డకు అరుదైన వ్యాధి ‘ఎఫ్‌ఓపీ’ సోకిందని డాక్టర్లు ధృవీకరించారు. రోజు రోజుకీ ఎదుగుతున్న బిడ్డ రాయి వలే మారిపోతోందని కటిక నిజం తెలుసుకున్న వారు బోరున విలపించారు.
ఎఫ్‌ఓపీ వ్యాధిపై డాక్టర్ల వివరణ..
ఎఫ్‌ఓపి వ్యాధిపై బాధిత తల్లిదండ్రులకు వైద్య నిపుణులు వివరణ ఇచ్చారు. ఎఫ్‌ఓపి అంటే ‘లెక్సి ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికన్స్ ప్రోగ్రెసివా’. ఈ వ్యాధి ప్రతి 20 లక్షల మందిలో ఒకరికి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారి శరీరంలో కండరాలు, కండరాలను కలిపి ఉండే టెండాన్స్, లిగిమెంట్ స్థానంలో ఎముకలు ఏర్పడతాయి. దీంతో ఆస్థిపంజరం లోపల ఎదగాల్సిన ఎముకలు.. వెలుపలే పెరగడంతో కదలిక ఆగిపోతుందని డాక్టర్లు చెప్పారు.
చిన్నతనంలో ఎముకల పెరుగుదల సాధారణంగా ఉన్నప్పటికీ.. వయస్సు పెరిగేకొద్ది వీటి ప్రభావం పెరిగి.. తీరా 20 ఏండ్లు వచ్చే సరికి జీవచ్ఛవంలా మారిపోతారు. మరో 20 ఏండ్లు(40 ఏండ్లు) వచ్చేసరికి ఏకంగా ప్రాణాలనే కోల్పోతారని డాక్టర్లు హెచ్చరించారు. అంతటి బాధలోనూ డాక్టర్ల మాటలు విన్న అలెక్స్, దవేలు దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. అయినప్పటికీ.. తమ పాప ఆరోగ్యం మెరుగవ్వడానికి ప్రయత్నాలు వదులుకోమని బాధలోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నారు.