జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

by Shamantha N |
జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహారిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు వేస్తున్న కుట్రను పోలీసులు భగ్నం చేశారు. టెర్రరిస్టుల కదలికలు ఉన్నాయన్న అనుమానంతో కుప్వారా జిల్లా లాల్‌పొరాలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా పేలుడు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story