- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఐజీ ఎదుట లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులు
దిశ, వాజేడు : తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఐదుగురు మావోయిస్టులు సీఆర్పీఎఫ్ డీఐజీ వినయ్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ్‌ల ఎదుట లొంగిపోయారు. వారిలో ఇద్దరిపై రూ.5 లక్షల రివార్డ్ ఉందని ఎస్పీ వెల్లడించారు.
నక్సల్స్ నిర్మూలనా ప్రచారంలో భాగంగా లోన్ వర్రాటు ప్రచారానికి ఆకర్షితులై జనజీవన స్రవంతిలోకి వచ్చి గౌరవ ప్రదమైన జీవితం గడిపేందుకు గంగుళూరు డీఏకేయంఎస్ అధ్యక్షుడు పొజ్జా సోడి, మిలీషియా కమాండర్ మాసా సోడి, భైరామ్‌గఢ్ ఏరియా కమిటీలో పనిచేస్తున్న బెచాపాల్ మిలీషియా సభ్యులు సుకురామ్, రాకేష్ మడకం, గ్రామ కమిటీ సభ్యుడు భూపేంద్ర కుమార్ సోడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు.
ఇప్పటి వరకూ దంతెవాడ జిల్లాలో 426 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఇందులో 115 మంది నక్సల్స్‌పై రివార్డులు ఉన్నాయని చెప్పారు. లొంగిపోయిన వారికి పునరావాస పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.