- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ గుండె దానం చేసిన ధన్యుడు ఇతనే..
దిశ, మోత్కూరు: తాను జీవితంలో ఓడిపోయినా అవయవదానంతో ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి(45) ఆదివారం మధ్యాహ్నం హైబీపీ రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం తక్షణమే హైదరాబాద్ తరలించాలని చెప్పడంతో, హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్పించి వైద్యులు శాయశక్తులా కృషి చేసినా అతని ప్రాణాలు కాపాడలేకపోయారు. హైబీపీతో అతని బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెప్పారు.
మెదడు పూర్తిగా పనిచేయక పోయినప్పటికీ అవయవాలు పనిచేస్తున్నాయని, అవయవదానంతో మరికొంతమందికి జీవితాన్ని ఇవ్వొచ్చని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పడంతో అవయవ దానానికి అంగీకరించారు. దీంతో మంగళవారం కామినేని ఆస్పత్రి నుంచి అతని గుండెను అపోలో ఆస్పత్రికి తరలించి, మరో ప్రాణాన్ని కాపాడారు. అంతేగాకుండా అతని కిడ్నీలను మరొకరికి అమర్చి ప్రాణాపాయం నుంచి కాపాడారు. లివర్ మరొకరికి, కారేటజ్ మరొకరికి దానం చేయడం ద్వారా ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపిన ఘనుడిగా నర్సిరెడ్డి చరిత్రలో నిలిచిపోయాడు. దీంతో నర్సిరెడ్డి కుటుంబ సభ్యులకు పలువురు హాట్సాఫ్ చెబుతున్నారు.