వృద్ధి అంచనాలను తగ్గించిన ఫిచ్ రేటింగ్స్!

by Harish |
వృద్ధి అంచనాలను తగ్గించిన ఫిచ్ రేటింగ్స్!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం, లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 5 శాతం వరకు వెనకబడుతుందని ఫిచ్ రేటింగ్ సంస్థ అంచనాలను వెల్లడించింది. గత నెలలో ప్రకటించిన అంచనాల కంటే ఇది తక్కువే. ఇండియాలో ఊహించిన దానికంటే ఎక్కువ రోజులు లాక్‌డౌన్ ఆంక్షలు విధించడంతో ఆర్థిక గణాంకాలు బలహీనమైనట్టు ఫిచ్ రేటింగ్ వెల్లడించింది. అయితే, గ్లోబల్ ఎకానమీ కొంత కోలుకునే సూచనలు ఉన్నట్టు అభిప్రాయపడింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుని 9.5 శాతానికి చేరుకుంటుందని వివరించింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చైనా మినహాయించి మిగిలిన దేశాల వృద్ధి ప్రస్తుత ఏడాదిలో సగటున 4.5 శాతం వరకు పతనమయ్యే అవాకాశాలున్నాయని ఫిచ్ రేటింగ్ అంచనా వేసింది. గణాంకాల వారీగా చూస్తే, ప్రస్తుత్ ఏడాదిలో అమెరికా మైనస్ 5.6 శాతం, చైనా 0.7 శాతం, జపాన్ మైనస్ 5 శాతం నమోదు చేయొచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఉద్దీపనలు పెరిగాయని, కానీ రికవరీ ఒడిదుడుకులతో వస్తోందని తెలుపింది. నెలవారీగా ఉన్న ఆర్థిక సూచీలను గమనిస్తే అంతర్జాతీయంగా మందగమనం చివరికి వచ్చినట్లు భావిస్తున్నట్టు ఫిచ్ రేటింగ్ వెల్లడించింది. అమెరికా, యూపర్‌లలో క్రమంగా వినియోగదారు కొనుగోళ్లు పెరుగుతున్నాయని తెలిపింది. నిరుద్యోగం పెరగడం, కరోనా నివరాణ కోసం విధించే నిబంధనలు వినిమయాన్ని తగ్గించే అవకాశముందని, సంస్థలు కొత్తగా మూలధన వ్యయాలను తగ్గించుకునేందుకు పలుమార్లు పునరాలోచించుకుంటాయని ఫిచ్ రేటింగ్ అభిప్రాయపడింది.

Advertisement

Next Story