- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది -5శాతం వృద్ధి: ఫిచ్ అంచనా
ముంబయి: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ దేశ సావరిన్ రేటింగ్ ఔట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించినట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ -5శాతం వృద్ధిని నమోదు చేయనున్నట్టు ఫిచ్ అంచనా వేసింది. అయితే, రానున్న ఏడాదిలో జీడీపీ 9.5శాతానికి పుంజుకునే అవకాశం ఉన్నట్టు అభిప్రాయపడింది. అన్‌లాక్ 1.0 కొనసాగుతున్న క్రమంలో కరోనా కేసులు పెరగడం వృద్ధిపై ప్రభావం చూపించిందని ఫిచ్ తెలిపింది. కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో దేశ వృద్ధి అవకాశాలు బలహీనపడినట్టు, ప్రభుత్వ రుణభారం పెరగడం వల్ల సవాళ్లు తప్పవని వెల్లడించింది. గతంలో ఉన్న 6 నుంచి 7 శాతం ఆర్థిక వృద్ధి స్థాయికి చేరడానికి మరికొంత సమయం పడుతుందని, వేచి చూడాలని ఫిచ్ అభిప్రాయపడింది. ఫిచ్ రేటింగ్ వెల్లడి తర్వాత దేశ సావరిన్ రేటింగ్ ఔట్‌లుక్‌పై విదేశీ రేటింగ్ ఏజెన్సీలన్నీ ప్రతికూలతను ప్రకటించినట్లు అయిందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే, మూడీస్ నెగటివ్ ఔట్‌లుక్‌ను ప్రకటించగా ఇప్పుడు ఫిచ్ రేటింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక, ఎస్ అండ్ పీ స్థిరత్వంగా ఉంటుందని రేటింగ్‌ను ప్రకటించింది.