- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీడీపీ వృద్ధి అంచనాలను సవరించిన ఫిచ్ రేటింగ్స్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత జీడీపీ వృద్ధి అంచనాలను సవరించింది. ఈ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇదివరకూ 11 శాతంగా ఉన్న వృద్ధి అంచనాను 12.8 శాతానికి మెరుగుపరిచింది. బలమైన రికవరీ, ఆర్థిక పనితీరు, వైరస్ నియంత్రణ పట్ల జాగ్రత్తలు వంటి అంశాలు వృద్ధి అంచనాల మెరుగుదలకు దోహదపడ్డాయని ఫిచ్ రేటింగ్స్ నివేదిక అభిప్రాయపడింది. తాజాగా వెలువరించిన గ్లోబల్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో దేశ జీడీపీ వృద్ధి కరోనా పూర్వస్థాయి అంచనాల కంటే తక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే, 2022-23లో జీడీపీ వృద్ధి రేటు -0.5 శాతం నుంచి 5.8 శాతానికి సవరిస్తున్నట్టు వెల్లడించింది. 2020 సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన మాంద్యం నుంచి భారత్ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటోందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అలాగే, 2021 ఏడాదిని భారత్ బలంగా ప్రారంభించిందని, ఫిబ్రవరిలో తయారీ పీఎంఐ పెరగడం, సేవల రంగం మెరుగ్గా కనిపిస్తోందని పేర్కొంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు కొంత ఆందోళన కలిగించే అంశమని వివరించింది.
ప్రపంచ జీడీపీ..
2021కి ప్రపంచ జీడీపీ 6.1 శాతం పెరుగుతుందని ఫిచ్ రేటింగ్స్ ఆశిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో 5.3 శాతంగా అంచనా వేసింది. ఆర్థిక ఉద్దీపనలు, భౌతిక దూరానికి అలవాటు పడటం, కరోనా వ్యాక్సిన్ పంపిణీలో వేగవంతం వంటి పరిణామాలు ప్రపంచ జీడీపీ అంచనాల సవరణకు కారణాలని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ప్రపంచ వృద్ధి రేటు 19980 తర్వాత వేగవంతమైన వార్షిక వృద్ధి అని పేర్కొంది.