- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫిషరీస్ భూములు ఇతరులకు ఇస్తామంటే ఒప్పుకోము
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే ఫిషరీస్ భూములను ఇతరులకు ఇస్తే ఒప్పుకునేది లేదని గంగపుత్రులు స్పష్టం చేశారు. నిజామాబాద్ నూతన కలెక్టరేట్‌లో నిర్మించిన కార్యాలయంలోకి ప్రస్తుతం అర్సపల్లిలో ఉన్న జిల్లా మత్స్య శాఖాధికారి కార్యాలయాన్ని మార్చి అక్కడ భూములను ఇతరులకు ఇస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ క్రమంలో మంగళవారం మత్స్యశాఖ కార్యాలయానికి జిల్లా వ్యాప్తంగా గంగపుత్రులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నగర గంగపుత్ర సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫిషరీస్ కార్యాలయం భూములు 4 ఎకరాల్లో విస్తరించి ఉండగా అందులో సగం కార్యాలయాలు, మిగిలిన సగం ఫిష్ ఫాండ్‌కు ఉన్నాయన్నారు.
అక్కడ కబ్జాలు జరిగితే గత 20 ఏళ్ళుగా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి కోర్టులో కోట్లాడామని గుర్తుచేశారు. వాటిని డెవలప్ చేసేందుకు తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.2 కోట్ల నిధులు వచ్చినా.. అధికారులు నిర్లక్ష్యం చేశారన్నారు. ఇప్పుడు అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను కట్టేందుకు అధికారులు ప్రయత్నించడం సరికాదన్నారు. గంగపుత్రులకు జిల్లా కేంద్రంలో కళ్యాణ మండపం, శిక్షణ కేంద్రం కోసం దశాబ్ధాలుగా దరఖాస్తు చేసుకున్నామని, ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్ని తరలించినప్పుడు గంగపుత్ర సంఘానికే కేటాయించాలని కోరారు. లేకపోతే ఆందోళన తప్పదని తెలిపారు.