- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చేపల పచ్చడి
ఎక్కువ కాలం నిల్వ ఉండే పచ్చళ్లను అందరూ ఇష్టపడుతుంటారు. నాన్‌వెజ్‌తో పచ్చళ్లు చేస్తే రుచిగా ఉంటుందనడంలో సందేహం లేదు. చేపల పచ్చడి 15 రోజుల నుంచి నెల రోజలు వరకు నిల్వ ఉంటుంది. అదిరిపోయే చేపల పచ్చడి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు:
చేప ముక్కలు -అరకేజీ,
అల్లం వెల్లుల్లి పేస్ట్ -3 టేబుల్ టీస్పూన్
కారం -4 టేబుల్ టీస్పూన్
ఉప్పు -రుచికి సరిపడా
ఆవాల పిండి -2 టేబుల్ టీ స్పూన్
మెంతి పిండి -1 టేబుల్ టీ స్పూన్
గరం మసాలా -2 టేబుల్ టీ స్పూన్
నిమ్మరసం -4 టేబుల్ టీ స్పూన్స్
ఎండు మిర్చి -2
కరివేపాకు – ఆరు రెమ్మలు
నువ్వుల నూనె -పావు కేజీ
పసుపు -పావు టీస్పూన్
ఫుడ్ కలర్ -కొద్దిగా
తయారీ విధానం
ఒక బౌల్‌లో ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను తీసుకుని పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని మరోసారి కలిపి ఆరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణిలో ఐదు టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసుకుని అందులో ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేయించుకోవాలి. చేప ముక్కలను ఎక్కువ సేపు కాకుండా రెండు నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దానిలో కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. అనంతరం గరం మసాలా పొడిని వేసి ఒక నిమిషం తర్వాత దించేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఆవా పిండి, మెంతి పిండిని వేసుకుని కలుపుకోవాలి. అనంతరం కారం, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. చివరగా ఫ్రై చేసిన చేప ముక్కలను వేసుకోవాలి. చేప ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలుపుకుంటే చేపల పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఒకరోజు తర్వాత తింటే ఎంతో రుచిగా ఉంటుంది.