ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫెస్టివల్

by Shyam |   ( Updated:2020-04-12 02:28:49.0  )
ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫెస్టివల్
X

దిశ, హైదరాబాద్: చేపల కూర, చేపల ఫ్రై ముక్కలు ప్రతి ఒక్కర్నీ నోరూరిస్తాయి. ఇదే చేపల కూరను మనం ఇంట్లో వండుకోవాలంటే ఏదో ఒక రకమే తయారు చేసుకుంటాం. అలాంటిది రకరకాల చేపలతో తయారు చేసిన వంటకాలన్నీ ఒకే దగ్గర ఉంటే..ఇక ఫిష్ ప్రియులకు పండుగే పండుగ. నగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా.. చికెన్ ఫెస్టివల్‌కు వేదికవ్వగా, ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీయార్ స్టేడియం ఫిష్ ఫెస్టివల్‌కు వేదికగా మారింది. హైదరాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫెస్టివల్‌లో సుమారు 100 రకాల చేపలతో 20 స్టాల్స్‌ను ప్రదర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ముషీరాబాద్ ఎమ్మేల్యే ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, కార్పొరేటర్లు లాస్య నందిత, ముఠా పద్మా, డీఎఫ్‌సీఎస్ అధ్యక్షులు కొప్పు పద్మ, జాయింట్ డైరెక్టర్ శంకర్ రాథోడ్, ఎండీ రజని పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed