‘కేంద్రానికి ప్రజలే బుద్ధి చెబుతారు’

by Shamantha N |
‘కేంద్రానికి ప్రజలే బుద్ధి చెబుతారు’
X

న్యూఢిల్లీ: మనదేశంలో తొలి ప్రైవేటు ట్రైన్ 2023 ఏప్రిల్‌లోపు పట్టాలెక్కనుందని రైల్వే శాఖ అంచనా వేసింది. భారత రైల్వే నెట్‌వర్క్‌లో తొలి ప్రైవేట్ ట్రైన్ 2023 ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశమున్నదని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గురువారం ప్రకటించారు. భారత రైల్వేలో సేవలందించడానికి ప్రైవేటు రంగానికి బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. 109 మార్గాల్లో(రెండువైపులా) అర్హతల కోసం అభ్యర్థలను కోరింది. ఈ నిర్ణయం ద్వారా రూ. 30వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు వస్తాయని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా వరకు ఈ ట్రైన్‌లు ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా తయారవ్వనున్నట్టు చెబుతున్నారు. ఫైనాన్సింగ్, ఆపరేషన్ సహా మెయింటెనెన్స్ కూడా ప్రైవేటు సంస్థలకే బాధ్యతలివ్వనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రైవేటు సంస్థల మధ్య పోటీతో టికెట్లు స్వల్పంగా ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. ట్రైన్ పేద ప్రజల జీవితాల్లో భాగంగా ఉన్నదని, ఇప్పుడు దాన్ని కూడా కేంద్రం లాగేసుకుంటున్నదని ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వానికి దేశ ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed