అలర్ట్.. సిరిసిల్లలో తొలి ఒమిక్రాన్ కేసు

by Sridhar Babu |
covid
X

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో తొలి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు న‌మోదైంది. దుబాయ్ నుంచి వ‌చ్చిన ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకునికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు జిల్లా మెడిక‌ల్, హెల్త్ ఆఫీస‌ర్ డాక్టర్ సుమన్ మోహన్ రావు సోమవారం అధికారికంగా ధ్రువీకరించారు. దీంతో స్థానికంగా ఆందోళన మొదలైంది. చికిత్స నిమిత్తం ఆ యువకుడిని గ‌చ్చిబౌలి టిమ్స్‌కు త‌ర‌లించామ‌ని అధికారులు తెలిపారు. అలెర్ట్ అయిన జిల్లా వైద్య అధికార బృందం యువకుడి కుటుంబ స‌భ్యులతో పాటు బంధువుల‌ శాంపిళ్లను సేక‌రించి టెస్ట్‌కు పంపామ‌న్నారు. అతడిని కలిసిన వారిని గుర్తించి పరీక్షలు చేయనున్నారు అధికారులు. జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed