- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మంలో తొలి కరోనా పాజిటివ్
దిశ, ఖమ్మం: జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు డీఎంహెచ్‌వో మాలతి స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన 139 మంది కరోనా లక్షణాలతో బాధపడుతుండగా, వారి శాంపిళ్లను పరీక్షలకు పంపామని తెలిపారు. ఇందులో 119 నెగిటివ్ రిపోర్టులు రాగా, ఒకటి పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. బాధితుడు ఖమ్మం రూరల్ మండలం పెద్ధతండాకు చెందిన వ్యక్తి(45) అని వెల్లడించారు. ఈయన రాజకీయ పార్టీలో కొనసాగుతున్నందున.. గత నెల 16న ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం 18న అక్కడి నుంచి, మర్కజ్‌లో పాల్గొని వస్తున్న వ్యక్తుల భోగీలో తిరుగు ప్రయాణమయ్యారు. ఓ వ్యక్తి సమాచారం మేరకు ఈయనను గుర్తించి నాలుగు రోజుల క్రితం క్వారంటైన్‌కు తరలించామని మాలతి తెలిపారు. తాజా, రిపోర్టుల్లో పాజిటివ్‌గా వెల్లడైందని స్పష్టం చేశారు. దీంతో పెద్ద తండాకు చెందిన దాదాపు 45 మందిని క్వారంటైన్‌కు తరలించనున్నట్టు చెప్పారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Tags: coronavirus, positive, corona in khammam, dmho malathi, markaz, delhi,