అధికార పార్టీ ఆఫీస్‌పై పెట్రో బాంబ్ దాడి.. ఉలిక్కిపడిన స్థానికులు

by vinod kumar |
అధికార పార్టీ ఆఫీస్‌పై పెట్రో బాంబ్ దాడి.. ఉలిక్కిపడిన స్థానికులు
X

యంగూన్: సైనిక చర్య, అత్యయిక పరిస్థితులు, ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో మయన్మార్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. తుపాకుల మోతలు, భయానక దృశ్యాలు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. కాగా తాజాగా నోబెల్ శాంతి బహుమతి విజేత ఆంగ్‌సాన్ సూకీకి చెందిన అధికార పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ కార్యాలయంపై పెట్రోల్ బాంబ్ దాడితో మయన్మార్ మరోసారి ఉలిక్కిపడింది.

శుక్రవారం ఉదయం 4గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగుడు అధికార పార్టీ కార్యాలయంపై పెట్రోల్ బాంబులు విసిరాడు. దీంతో పార్టీ కార్యాలయంలో మంటలు వ్యాపించాయి. కాగా విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి ఫైర్ అధికారులు వెంటనే చేరుకొన్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా తమ పార్టీ కార్యాలయంపైకి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబ్ విసిరినట్టు తమకు తెలిసిందని ఎన్ఎల్‌డీ పార్టీ కార్యాలయ ఇంచార్జ్ తెలిపారు. ఈ దాడిలో కార్యాలయ ప్రధాన ద్వారం కాలిపోయిందని వెల్లడించారు. ఆస్తి నష్టం గురించి అధికారులు అంచనా వేస్తున్నారని చెప్పారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది ఎవరో తమకు తెలియరాలేదన్నారు. ఇలాంటి ఘటనలు ఎవరూ చేసినా అది తప్పేనని అన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

Next Story

Most Viewed