మంటలను పసిగట్టే శాటిలైట్స్….

by srinivas |   ( Updated:2021-03-07 03:43:57.0  )
మంటలను పసిగట్టే శాటిలైట్స్….
X

దిశ, అచ్చంపేట : అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతం అనగానే అందరికీ గుర్తొచ్చేది నల్లమల అటవీ ప్రాంతం…. అది ఒకప్పటి దండకారణ్యం, దట్టమైన విశాల భూభాగం కలిగిన ఈ అటవీ ప్రాంతంలో వేసవికాలం ప్రారంభం నుండే ఎక్కడో ఒకచోట అడవితల్లి అగ్నికి ఆహుతి అవుతూ… అటవీశాఖ అధికారులను నెమరు పాటు లేకుండా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడవిలో మంటలు చెలరేగగానే అటవీశాఖ అధికారులు ఎలా అప్రమత్తమవుతారు. మంటలు అంత పెద్ద అడవిలో ఎక్కడ చెలరేగాయో ఎలా తెలుసుకుంటారు. ఇలా చాలా ప్రశ్నలు నల్లమల ప్రాంతంలోని వారికి రాష్ట్ర ప్రజలకు తెలియదు. వీటిని తెలుసుకునేందుకే..ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండు ఉపగ్రహాలతో దేశంలోని అడవులపై పూర్తి నిఘా ఏర్పాటు చేశారు. అడవుల్లో ఎక్కడ చిన్నపాటి అగ్ని ప్రమాదం సంభవించినా ఈ శాటిలైట్లు సెన్సార్ ల సాయంతో పసిగట్టి చిత్రాలు తీస్తాయి.

ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ….

2004 నుండి MODIS (మోడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్ట్రో-రేడియోమీటర్) ను, సెన్సార్ ఆన్-బోర్డు ఆక్వా , నాసా టెర్రా ఉపగ్రహాల ద్వారా అడవిలో సంభవించే మంటలను పసిగడతారు. వీటిని అధునాతన టెక్నాలజీ సాయంతో నిర్వహించే ఆటోమెటిక్ మెస్సేజింగ్ విధానాన్ని ఏర్పాటు చేయడంతో…. సదరు ప్రాంతంలోని అధికారులను అప్రమత్తం చేసేందుకు ఇది దోహద పడుతుంది.

ఉపగ్రహం తన కక్ష్యలో….

ఉపగ్రహం భూమి చుట్టూ పరిభ్రమిస్తూ రోజులో రెండు సార్లు భారత్ లోని అన్ని అటవీ ప్రాంతాలను ఇవి పరిశీలిస్తాయి. ఉదయం‌ మధ్యాహ్నం తిరిగే ఈ గ్రహాలు 1 కిలోమీటర్ల 1 కిలోమీటర్ల రిజల్యూషన్ ఫైర్ హెచ్చరికలు సంబంధించిన వివరాలను ఎస్ఎంఎస్ల ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తూ చేరవేస్తాయి. అంతేకాకుండా మరో నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని 2017 సంవత్సరంలో మరో కొత్త సాంకేతికతను కలుపుకొని సెన్సార్ SNPP-VIIRS (సుయోమి-నేషనల్ పోలార్-ఆర్బిటింగ్ పార్టనర్‌షిప్ – విజిబుల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ సూట్) ను రంగంలోకి దింపింది. ఎస్ ఎన్ పి పి ….వి ఐ ఆర్ ఎస్ లో ప్రాదేశిక రిజల్యూషన్ 375 మీ. వ్యాసార్థంలో ప్రతి రోజు రెండు సార్లు ఉదయం 1.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు ఇది దేశంలో భ్రమిస్తుంది. మోడిస్‌తో పోలిస్తే SNPP- రాత్రి సమయాల్లో కూడా ఖచ్చితమైన సమాచారం, ఫోటోలనుఉపగ్రహ చానల్ ద్వారా తీస్తూ సదరు ప్రదేశాన్ని గుర్తిస్తూ అధికారులకుపంపిస్తుంది.

ఫైర్ సిస్టం అలర్ట్ వర్షన్ ..

ఫైర్ సిస్టం అలర్ట్ వర్షన్ ద్వారా నమోదు చేయబడిన అటవీశాఖ అధికారులకు, సమీప ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువతకు మెస్సేజ్ ల ద్వారా సమాచారం ఇవ్వడంతో అధికారులు చేరుకునే లోపు స్థానికులే వాటిని అదుపుచేసేలా ఈ మెస్సేజ్ సిస్టం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ మెస్సేజ్ ల రూపంలో అధికారులను అప్రమత్తం చేయడం, మెస్సేజ్ లో వచ్చే లింక్ ను ఓపెన్ చేయడంతో గూగుల్ మ్యాప్ ద్వారా ఆ మంటలు ఎగసిపడే ప్రాంతాన్ని సైతం లొకేషన్ లో చూపడం వలన త్వరగా మంటలను అదుపుచేసేందుకు వీలవుతుంది.

ఈ మెస్సేజ్ లు రాగానే రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఫారెస్టు అధికారులు అలర్ట్ అయ్యి ఫైర్ ప్రొటెక్ట్ వాచర్ల సహాయంతో అడవిలో మంటలు ఆర్పేందుకు కృషి చేస్తారు. వెళ్ళడానికి వీలు లేని చోట అడవిలో మంటలు చెలరేగి వాటంతట అవే ఆరిపోతుంటాయి. (ఎందుకంటే అక్కడక్కడా ఏర్పాటు చేసే ఫైర్ వాల్స్ మంటలను విస్తరించకుండా కొంత మేర అడవిలో వంటలను నివారణ చేసే దిశగా సంబంధిత అటవీశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు.

వన్యప్రాణి సంరక్షణ దిశగా అడుగులు..

వన్యప్రాణి సంరక్షణదిశగా అడుగులువేయిస్తూ దట్టమైన అడవుల్లో శాటిలైట్ విధానం ద్వారా ఎదురవుతున్న సమస్యలను… ప్రధానంగా అడవుల్లో తలెత్తుతున్న మంటలను అడవుల్లో జీవిస్తున్న వన్యప్రాణులను సంరక్షించేందుకు కొంతవరకు దోహదం చేస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story