యాదాద్రి జిల్లాలో అగ్నిప్రమాదం

by Shyam |
యాదాద్రి జిల్లాలో అగ్నిప్రమాదం
X

దిశ, నల్లగొండ: యాదాద్రి జిల్లా కొండమడుగు శివారులోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ శివారులో బీఏఎఫ్ ఫర్నిచర్ తయారీ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో డోర్లు, ఫ్రేమ్ ఇతర ఫర్నీచర్ సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకుని ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ. 60 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బీఏఎఫ్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story