- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ: మరో కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కొవిడ్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో మరోమారు అందరూ ఉలిక్కిపడ్డట్టయ్యింది. అయితే, ఈ సారి వెంటనే అలర్ట్ కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ వార్డును ఏర్పాటు చేసి అందులో కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. దానికి పక్కనే ఉన్న రికార్డ్ రూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లు వెంటనే అలర్టయ్యారు. మొదటగా ఫైర్ స్టేషన్ కు సమాచారమిచ్చారు. అనంతరం పక్కనే ఉన్న కొవిడ్ వార్డు నుంచి కరోనా పేషెంట్లను మరో వార్డుకు తరలించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టయ్యింది. లేకుంటే విజయవాడ అగ్నిప్రమాద ఘటన మాదిరిగా ఇక్కడ కూడా కరోనా పేషెంట్లు అగ్ని ప్రమాదానికి గురయ్యేవారేమో.