- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూడు చెదిరే.. గుండె పగిలే
దిశ, భద్రాచలం: చర్ల మండలం కేశవాపురం గ్రామపంచాయతీ రాళ్ళగూడెంలో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభించింది. అందరు గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ ప్రమాదంలో సోడి సమ్మక్క, ఆమె కుమారుడు సోడి సమ్మయ్యల ఇండ్లు తగులబడ్డాయి. అకస్మాత్తుగా ఇంటిపై మంటలు కనిపించడంతో ఇంటిలో వారు ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగుతీశారు.
ఎగిసి పడుతున్న మంటలు గమనించిన గ్రామస్థులు అరుపులు, కేకలు వేసుకుంటూ పరుగెత్తుకొచ్చేలోగానే రెండు ఇళ్ళలో మంటలు వ్యాపించి భస్మీపటలమైనాయి. ఏ వస్తువులు తీసే అవకాశం లేకపోవటంతో బాధితులకు కట్టుబట్టలే మిగిలాయి. ఈ అగ్ని ప్రమాదంలో లక్ష రూపాయల నగదుతోపాటు ఆరుగాలాలు, శ్రమించి కూడబెట్టిన ఆస్థపాస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు ఐదు లక్షల మేరకు ఆస్థినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. గూడు కాలిపోవడంతో అగ్నిబాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆపన్నహస్తాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.