- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుల్తానాబాద్ కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..
by Sridhar Babu |
X
దిశ, పెద్దపల్లి : సుల్తానాబాద్ పట్టణంలోని కరోనా ఐసోలేషన్ సెంటర్ ఆవరణలో అగ్నిప్రమాదం సంభవించగా తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టగా అది చుట్టుపక్కలకు విస్తరించింది. ఈ ఘటనలో ఆస్పత్రికి సంబంధించిన మంచినీటి పైపులు, కరెంటు మోటారు దగ్ధమయ్యాయి.
మంటలు చెలరేగడంతో ఆస్పత్రి మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఐసోలేషన్ సెంటర్లో దాదాపు 20 మంది పేషెంట్లు ఉండగా, పొగ వలన ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఆస్పత్రి వర్గాలను వివరణ కోరగా పొంతన లేని సమాధానం ఇచ్చారు. ఆసుపత్రి ప్రాంగణంలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో మంటలు విస్తరించి ప్రమాద జరిగిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
Advertisement
Next Story