వీడిన వృద్ధుడి మిస్సింగ్ మిస్టరీ

by srinivas |
వీడిన వృద్ధుడి మిస్సింగ్ మిస్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: వృద్ధుడు వసంతరావు మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. విజయవాడ కోవిడ్ ఆసుపత్రి మార్చురీలో వృద్ధుడు వసంతరావు మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. గత నెల మే 24న వృద్ధుడు ఆస్పత్రిలో మృతి చెందాడు. అనంతరం సిబ్బంది మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే వృద్ధుడి ఆచూకీ కోసం బంధువులు కోరినా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దాదాపు 10 రోజుల నుంచి వసంతరావు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నా ఎటువంటి సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రి సీసీ కెమెరాల ద్వారా పోలీసులు వృద్ధుడి ఆచూకీ కనుగొన్నారు. మార్చురీలో ఉన్న వసంతరావు మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అందజేశారు.

Advertisement

Next Story