- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎయిర్ఇండియా కొనుగోలుకు బిడ్ దాఖలు చేసిన టాటాసన్స్!
దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాను కొనేందుకు బుధవారం టాటాసన్స్ సహా వివిధ సంస్థలు ఆర్థిక బిడ్‌లను సమర్పించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎయిర్ఇండియా కొనుగోలుకు బుధవారమే తుది గడువు కావడంతో పలు సంస్థలు తమ బిడ్లను సమర్పించాయని తెలుస్తోంది. ఆర్థిక బిడ్లను దాఖలు చేసిన కంపెనీల జాబితాలో టాటాసన్స్ కూడా ఉందని ఎయిర్ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
‘లావాదేవీ సలహాదారుల ద్వారా ఎయిర్ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఆర్థిక బిడ్లను అందుకున్నాం. దీని తర్వాత తదుపరి ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటుందని’ పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) వెల్లడించింది. కాగా, ఎయిర్ఇండియా సంస్థ మొత్తం రూ. 43 వేల కోట్ల అప్పుల భారాన్ని మోస్తోంది. ఈ రుణాలకు సంబంధించి ప్రభుత్వ హామీ ఉండదు. కాబట్టి ఎయిర్ఇండియాను కొనుగోలు చేసే సంస్థ ఈ రుణాలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలను బహిర్గతం చేయలేదని తెలుస్తోంది.