- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మామిడికాయల సేకరణలో కొత్త ఒరవడి : మంత్రి హరీశ్ రావు
by Shyam |
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపూర్‌లో మామిడికాయల సేకరణ కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు గురువారం ప్రారంభించారు. ఈ కేంద్రం మామిడి రైతులకు ఓ వరమని మంత్రి పేర్కొన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా మామిడికాయల సేకరణ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రం ద్వారా మామిడి రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశంతోపాటు తరుగు ఇబ్బంది, వ్యయప్రయాసాలు తప్పుతాయన్నారు. గడ్డి అన్నారం మార్కెట్ ధర ప్రకారం రోజూ వారీగా ధరలు ఉంటాయన్నారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 13,400 ఎకరాల్లో రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారని, రానున్న రోజుల్లో మామిడి కాకుండా సెర్ఫ్ పద్ధతిలో కూరగాయల విక్రయాలు జరిపే యోచనలో ఉన్నామన్నారు. అందుకు ప్రత్యామ్నాయ పంటల మీద రైతులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
tags: mango purchase centers, minister harish rao,visit
Advertisement
Next Story