- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెంపుల్ షూటింగ్.. హీరో హీరోయిన్లను చూసేందుకు ఎగబడిన జనం
దిశ, జనగామ: వరంగల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ అంటేనే ఒక మాయాజాలం.. ఇక్కడి ప్రాంతంలో షూటింగ్ మొదలు పెట్టారంటే 100 రోజులు పక్కా అనే నమ్మకం సినీ పరిశ్రమలో ఉంటుంది. జనగామ జిల్లా ఓబుల్ కేశవాపూర్ గ్రామంలో గ్రామానికి చెందిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశ్వర్లు నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో సినిమా షూటింగ్ ప్రారంభించారు. హౌస్‌ఫుల్ సినిమా ప్రజెంట్స్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ 01 సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి. నరేష్ కుమార్ క్లాప్ కొట్టగా, హీరో మనోజ్ పుట్టముర్, హీరోయిన్ అరథి పుట్టి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ జనగామ జిల్లా యువజన నాయకులు కొమ్ము రాజు షూటింగ్‌ను ప్రారంభోత్సవం చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కసుకుర్తి బాల కిషోర్ మాట్లాడుతూ.. వారం రోజుల రెగ్యులర్ షూటింగ్ జనగామ పరిసర ప్రాంతాలలో జరుగుతుందని ఇది అందరికీ నచ్చే సినిమా అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుక, ఎంపీటీసీ కొమ్ము సుజాత- జగదీష్ కారోబార్ రమేష్, తిరుపతి రెడ్డి మల్లారెడ్డి, బడికే కిష్టయ్య, సంజీవ్, కిరణ్, గొలనుకొండ కృష్ణకుమార్, సోములు రవి, మాటూరి వెంకటేష్, శివరాత్రి రాజు లతో పాటు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.