ముగ్గురు మహిళల ఫిర్యాదుతో పోలీసులపై కేసు

by srinivas |
ముగ్గురు మహిళల ఫిర్యాదుతో పోలీసులపై కేసు
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు అర్బన్ పోలీసులపై కేసు నమోదు అయింది. నల్లబోలు సునీత, రాయిది నాగలక్ష్మీ, తుమ్మటి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ముగ్గురు మహిళలు.. తమ భర్తలను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని హైకోర్టును ఆశ్రయించారు. వీరు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వ్యవహారంపై గుంటూరు అర్బన్ పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోలీసుల కౌంటర్ పై కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ముగ్గురు భర్తల వ్యవహారంలో పోలీసుల పాత్రపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

Advertisement

Next Story

Most Viewed