- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి బారి నుంచి దోబీఘాట్ స్థలాన్ని కాపాడండి: రజక సంఘం..
దిశ, ఉప్పల్: ఉప్పల్ సర్కిల్ చిల్కానగర్ డివిజన్ దోబీఘాట్ స్థలం సర్వే నెంబర్ 793 /1 లోని ఒక ఎకర 30 గుంటలు స్థలం కబ్జాకు గురైందని రజక సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కబ్జా బారి నుండి విముక్తి కల్పించాలంటూ.. పోరాటాలు చేసినా ఆక్రమణదారుల చెర నుంచి విడిపించుకోలేని పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారుల, అధికార పార్టీ నాయకులకు సహకరించి వారి పలుకుబడిని ఉపయోగించుకుని అక్రమంగా దోబీఘాట్ స్థలాన్ని కబ్జా చేశారన్నారు.
ఈ విషయమై పలు మార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ సిబ్బంది కూడా పట్టించుకోలేదని లక్ష్మారెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ఆక్రమణదారులను గుర్తించి సమస్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులపై, అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్య పై రజక సంఘం నాయకులు లక్ష్మారెడ్డి ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బిక్షపతి శ్రీనివాస్ కృష్ణ వెంకటేశ్వర్లు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పప్పుల వెంకటేష్, రాజ్యలక్ష్మి , కరీపే సంతోష్ కుమార్, ఆశు, గణేష్ నాయక్, మలు నాయక్, షబ్బీర్, హనుమంత్ గుప్త సురేందర్ సాయిబాబా పాల్గొన్నారు.