నేను ఎమ్మెల్యే మనిషిని..? నడిరోడ్డుపై రచ్చరచ్చ

by Sridhar Babu |
gdk
X

దిశ, గోదావరిఖని : కూరగాయలు కొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి తాను ఎమ్మెల్యే మనిషిని అని చెప్పుకుంటూ.. ధర విషయంలో వ్యాపారితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటన గోదావరిఖని గాంధీ నగర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గాంధీనగర్ ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్ముతున్న విష్ణు అనే యువకుడి దగ్గరకు వెజిటెబుల్స్ కోసం వచ్చిన ఓ వ్యక్తికి మధ్య రేటు విషయంలో మాట మాట పెరిగింది.

దీంతో నేను ఎమ్మెల్యేతో మాట్లాడి ఇక్కడ కూరగాయల దుకాణాలు పెట్టించాను. నాకే ఎదురు చెప్పుతావా.. అంటూ చంద్రశేఖర్ హల్‌చల్ సృష్టించాడు. ఈ క్రమంలోనే విష్ణు, చంద్రశేఖర్ గొడవపడి ఒకరినొకరు కొట్టుకుంటూ ఉండగా అటు వైపు నుండి వెళ్తున్న ఒకటవ పట్టణ సీఐ రమేష్ బాబు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Next Story